23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్‌ గాంధీ ఓట్‌ చోరీ ఆరోపణలపై నితిన్‌ నబీన్‌ విమర్శలు

Writer: Pooja 04:09 PM, 23 నవంబర్, 2026
రాహుల్‌ గాంధీ ఓట్‌ చోరీ ఆరోపణలపై నితిన్‌ నబీన్‌ విమర్శలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై ఇండియా కూటమి అనవసర రాద్ధాంతం చేస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శించారు. ఎస్‌ఐఆర్‌పై భాజపా ఇచ్చిన వివరణకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు. విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తెలంగాణలోని కరీంనగర్‌లో భాజపా మహాపాదయాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నితిన్‌ నబీన్‌ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ రాజ్యాంగాన్ని కేవలం జేబులో పెట్టుకుంటారని, తాము మాత్రం హృదయాల్లో పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. తరచూ ఓట్ల చోరీ అంటూ ఆరోపణలు చేస్తున్న రాహుల్‌ గాంధీ ముందుగా ఓటర్ల జాబితాలోని తప్పులపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది మరణించినప్పటికీ వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగాలా? వలస వెళ్లిన ఆరు కోట్ల మందికి రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉండాలా? చొరబాటుదారులకు ఓటు వేసే అవకాశం కల్పించాలా? అని నిలదీశారు. రాజ్యాంగం ఇలాంటి వాటికి అనుమతించదని పేర్కొన్నారు.

విదేశాలకు వెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేయడం ద్వారా రాహుల్‌ గాంధీ భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని నితిన్‌ నబీన్‌ ఆరోపించారు. దేశాభివృద్ధి కంటే ఆయనకు కుటుంబ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాహుల్‌ గాంధీకి ఏటీఎంలా పనిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో అవినీతి పాలనకు చరమగీతం పాడిన తెలంగాణ ప్రజలకు, ప్రస్తుతం అంతకుమించిన అవినీతి పాలన ఎదురవుతోందని వ్యాఖ్యానించారు. అంతకుముందు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో భాజపాకు బలం లేదని భావించే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు కరీంనగర్‌కు వచ్చి చూడాలని అన్నారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాలని, రామరాజ్యం, మోదీ రాజ్యం స్థాపించాలని ఆకాంక్షించారు. ఎస్‌ఐఆర్‌ ద్వారా మరణించిన వారి ఓట్లను తొలగించాలా? వద్దా? అని ప్రశ్నించారు. అనంతరం కరీంనగర్‌లోని గాంధీ చౌక్‌ నుంచి కమాన్‌ చౌరస్తా వరకు మహాపాదయాత్ర కొనసాగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. లోగో, ట్యాగ్‌లైన్ పోటీలకు ఆహ్వానం!

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. లోగో, ట్యాగ్‌లైన్ పోటీలకు ఆహ్వానం!

కరీంనగర్‌లో భాజపా నేతల భారీ పాదయాత్ర

కరీంనగర్‌లో భాజపా నేతల భారీ పాదయాత్ర

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మాజీ కార్పొరేటర్ భర్త అరెస్ట్

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మాజీ కార్పొరేటర్ భర్త అరెస్ట్

పిఠాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

పిఠాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు!

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు!

పిఠాపురం జనసేనలో అసమ్మతి.. ఎంపీ పీఏపై దాడి!

పిఠాపురం జనసేనలో అసమ్మతి.. ఎంపీ పీఏపై దాడి!

ట్యాగ్లు
నితిన్ నబీన్భాజపాఎస్‌ఐఆర్ఓటర్ల జాబితాబండి సంజయ్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. భర్తకు విడాకులు ఇవ్వనున్న సప్నా చౌదరి
గాసిప్స్

ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. భర్తకు విడాకులు ఇవ్వనున్న సప్నా చౌదరి

కార్తిక పౌర్ణమి దీపారాధన గురించి స్కాందపురాణం ఏం చెబుతోంది?
జనరల్

కార్తిక పౌర్ణమి దీపారాధన గురించి స్కాందపురాణం ఏం చెబుతోంది?

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. లోగో, ట్యాగ్‌లైన్ పోటీలకు ఆహ్వానం!
రాజకీయాలు

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. లోగో, ట్యాగ్‌లైన్ పోటీలకు ఆహ్వానం!

కరీంనగర్‌లో భాజపా నేతల భారీ పాదయాత్ర
రాజకీయాలు

కరీంనగర్‌లో భాజపా నేతల భారీ పాదయాత్ర

రాహుల్‌ గాంధీ ఓట్‌ చోరీ ఆరోపణలపై నితిన్‌ నబీన్‌ విమర్శలు
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ ఓట్‌ చోరీ ఆరోపణలపై నితిన్‌ నబీన్‌ విమర్శలు

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మాజీ కార్పొరేటర్ భర్త అరెస్ట్
రాజకీయాలు

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మాజీ కార్పొరేటర్ భర్త అరెస్ట్

భారీగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

భారీగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం
జనరల్

గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం

పిఠాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
రాజకీయాలు

పిఠాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

ఆలయంలో వింత ఘటన.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న భక్తుడు!
జనరల్

ఆలయంలో వింత ఘటన.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న భక్తుడు!

బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన ముకేష్.. ఇంట్లో పెద్ద గొడవ!
షోస్

బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన ముకేష్.. ఇంట్లో పెద్ద గొడవ!

హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..
జనరల్

హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!