
గాసిప్స్

కాకినాడ జిల్లా పిఠాపురంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా జనసేన పార్టీలోని రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎంపీ అనుచరుడు చక్రిపై కొందరు జనసేన నాయకులు దాడి చేసి అక్కడి నుంచి తరిమికొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనను నిరసిస్తూ జనసేన నాయకులు పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. మరోవైపు, మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా బొజ్జ వెంకటేశ్వరరావు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు స్థానికంగా రాజకీయ చర్చకు దారితీశాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!