
గాసిప్స్

వరంగల్‌లో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన తాజా మాజీ కార్పొరేటర్ భర్త ముష్కమల్ల సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్‌ఫండ్ కేసుకు సంబంధించి అందిన ఫిర్యాదు ఆధారంగా మిల్స్ కాలనీ పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
రాత్రి బీఆర్ఎస్‌లో చేరిన సుధాకర్ ఉదయానికే అరెస్ట్ కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్ట్ అధికార పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే, చిట్‌ఫండ్ కేసులో వచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!