
న్యూస్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కు రిప్లై ఇచ్చారు. రేపు జరిగే సిట్ విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో సమయం ఇవ్వాలని సిట్‌ను కోరారు. విచారణను వాయిదా వేయాలని, అవసరమైతే మరింత సమయం కల్పించాలని అభ్యర్థించారు.

విచారణకు పూర్తి సహకారం అందిస్తానని కేసీఆర్ తెలిపారు. అయితే, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారణ జరపాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ కారణంగా వ్యక్తిగతంగా హాజరుకావడం సాధ్యం కాదని వివరణ ఇచ్చారు. సిట్‌కు సమాధానం పంపిన నేపథ్యంలో, తదుపరి విచారణ తేదీపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!