

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ పి. విజయారెడ్డి 2024లో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయకుండా చూడాలని కోరుతూ విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
దానం నాగేందర్ అనర్హత నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటించగా, సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అనంతరం తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఖాళీ స్థానంపై కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు. అయితే ఉపఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ ఇంకా ప్రకటించలేదు. తాజా పిటిషన్‌పై హైకోర్టు తీసుకునే నిర్ణయం తదుపరి ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!