

పేదలకు న్యాయం చేయాలనే బాధ్యతతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని తాను విశ్వసిస్తానని, ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు, సమస్యలను తెలుసుకుంటూ పనిచేస్తున్నానని తెలిపారు. ప్రతి నెలా నాలుగు కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని చెప్పారు. ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, 9న ‘మీ భూమి-మీ హక్కు’, ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర, నాలుగో శనివారం సంజీవని కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 28వసారి పింఛన్ల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.
గత పాలనలో ఏర్పడిన భూ వివాదాలను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు అన్నారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు పింఛన్ల కోసం రూ.76 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పేదరికాన్ని కేవలం ఆర్థిక కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంక్షేమంతో పాటు పీ4 కార్యక్రమం ద్వారా అట్టడుగు వర్గాలకు చేయూత అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!