

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతిపాదిత ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2024లో దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నిక ప్రక్రియను నిలిపివేయాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్లో ఎన్నికల సంఘంతో పాటు దానం నాగేందర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా, దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నాగేందర్ విజయం సాధించారు. అనంతరం ఎన్నికల అఫిడవిట్లో వివరాల వెల్లడికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విజయారెడ్డి ఆయన ఎన్నికను సవాల్ చేశారు. ఆ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందు తన 2024 పిటిషన్‌పై నిర్ణయం ఇవ్వాలని విజయారెడ్డి తాజాగా హైకోర్టును కోరారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!