
సినిమాలు

ఢిల్లీలోని జనపథ్ రోడ్ సమీపంలోని సాగర్ రత్నలో ఇండియా కూటమికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు లంచ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన అనంతరం ఈ భేటీ జరగనుంది. కూటమిలోని నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం, పరస్పర సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
సమావేశంలో కూటమి తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టే అంశంపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ప్రతిపక్ష కూటమి భవిష్యత్ వ్యూహం, ఉమ్మడి కార్యాచరణపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!