
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక రాజధాని అని ఏపీ బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన "మావిగన్" వ్యాఖ్యలపై స్పందిస్తూ, రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతేనని మరోసారి వెల్లడించారు.
మొదట అమరావతికి మద్దతు తెలిపిన జగన్, తర్వాత మూడు రాజధానులంటూ, ఇప్పుడు కొత్త వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటాన్ని తట్టుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తన పాలనలో రాజధాని అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!