

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామాయణ సినిమా మంచి స్పందనతో ముందుకు సాగుతోంది. రణబీర్ కపూర్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, యష్ రావణుడి పాత్రలో కనిపించారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. వారిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. అయితే ఆమె పాత్రకు సంబంధించి మొదటి నుంచి అభిమానుల్లో నిరాశ కనిపిస్తోంది. కనీసం ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేయలేదు. ప్రచార కార్యక్రమాల్లోనూ కాజల్ కనిపించకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సినిమాలో అయినా ఆమెకు మంచి ప్రాధాన్యం ఉంటుందని ఆశించిన వారికి చివరకు నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది. మొత్తం చిత్రంలో కాజల్ అగర్వాల్‌కు 2 నిమిషాల స్క్రీన్ స్పేస్ కూడా దక్కలేదు. ఉన్న కొద్దిపాటి సన్నివేశాల్లోనూ చెప్పుకోదగ్గ సంభాషణలు లేకపోవడం అభిమానులను మరింత నిరుత్సాహపరిచింది. ఇంతటి భారీ చిత్రంలో కాజల్ పాత్రకు ఇంత తక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!