
జనరల్

మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. బుధవారం ఉదయం ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ముద్రగడ పద్మనాభం అందించిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ గౌరవాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!