

రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయి విజువల్ అనుభూతిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘డ్యూన్’, ‘ది ఒడిస్సీ’ వంటి హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ‘రామాయణ’ రూపుదిద్దుకుంటోందని నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ మహాకావ్యాన్ని ప్రపంచ ప్రేక్షకులకు సరికొత్త దృక్కోణంలో పరిచయం చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఒక అమెరికన్ ప్రేక్షకుడు తమతో మాట్లాడుతూ ప్రపంచంలోనే పురాతనమైన కథను తెరపై చూడబోతున్నామనే ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడని నమిత్ పేర్కొన్నారు. కొత్త కథల కోసం ప్రపంచ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ సమయంలో భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ చిత్రంలో రావణుడిగా యష్ నటిస్తుండగా, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కనిపించనున్నారు. 2026 దీపావళికి తొలి భాగం, 2027లో రెండో భాగం విడుదల కానున్నాయి. జులై 23న శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా ఫస్ట్ లుక్ విడుదల చేయగా, జులై 24న ట్రైలర్‌ను ఆవిష్కరించి ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!