
జనరల్

పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ అభిప్రాయ సేకరణ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన నలుగురు పార్టీ నాయకులను సస్పెండ్ చేయడంతో పాటు, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనకు సంబంధించి 12 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో పాటు మీడియా ప్రతినిధులపై దాడికి ప్రయత్నించిన ఘటనను సీఎం తీవ్రంగా పరిగణించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై, వారు ఏ పదవిలో ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని స్థాయిల నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!