15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

Writer: Shivani K 09:23 AM, 15 జులై, 2026
నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలోనూ ఆయన సినిమాలకు ప్రత్యేక ప్రేక్షక వర్గం ఏర్పడింది. ‘ఓపెన్‌హైమర్’ తర్వాత నోలన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యాట్ డామన్, టామ్ హాలండ్ వంటి హాలీవుడ్ నటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ల వద్ద టికెట్ల కోసం ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

ఈ చిత్రాన్ని పూర్తిగా ఐమాక్స్ 70ఎంఎం ఫిల్మ్ కెమెరాలతో చిత్రీకరించడంతో ఐమాక్స్ స్క్రీన్లలో చూసేందుకు ప్రేక్షకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని పీవీఆర్ ఐకాన్ లోయర్ పరేల్‌లో రిక్లైనర్ సీట్ల ధరను రూ. 3,100గా నిర్ణయించగా, ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని పీవీఆర్ ప్రియా, సెలెక్ట్ సిటీ వాక్‌లలో ఈ ధర రూ. 2,500 వరకు చేరింది. సాధారణ సీట్ల ధరలు కూడా రూ. 1,000 నుంచి రూ. 2,100 మధ్య ఉండటం గమనార్హం. బెంగళూరులో టికెట్లు రూ. 1,200 నుంచి రూ. 1,950 వరకు, కోల్‌కతాలో రూ. 1,100 నుంచి రూ. 1,240 వరకు విక్రయిస్తున్నారు. చెన్నైలో మాత్రం ప్రభుత్వ నిబంధనల కారణంగా గరిష్ట ధర రూ. 508కే పరిమితమైంది. గ్రీక్ మైథాలజీ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద కూడా కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'మండాడి'కి కొత్త రిలీజ్ డేట్

'మండాడి'కి కొత్త రిలీజ్ డేట్

రాజమౌళి మ్యాజిక్‌పై ప్రియాంక కామెంట్స్ వైరల్!

రాజమౌళి మ్యాజిక్‌పై ప్రియాంక కామెంట్స్ వైరల్!

కమల్ హాసన్ కంటే ఆయనే గొప్ప నటుడు - పోసాని

కమల్ హాసన్ కంటే ఆయనే గొప్ప నటుడు - పోసాని

ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత

ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత

భారీ బడ్జెట్...భారీ నిరాశ

భారీ బడ్జెట్...భారీ నిరాశ

ట్యాగ్లు
క్రిస్టోఫర్ నోలన్ది ఒడిస్సీమ్యాట్ డామన్టామ్ హాలండ్హాలీవుడ్ సినిమాఐమాక్స్ 70ఎంఎంఓపెన్‌హైమర్బాక్సాఫీస్ రికార్డులుసినిమా వార్తలుఅంతర్జాతీయ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా

ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్
సినిమాలు

కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్

కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్
సినిమాలు

కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్

ట్రంప్‌పై యాసమిన్ తీవ్ర వ్యాఖ్యలు
జనరల్

ట్రంప్‌పై యాసమిన్ తీవ్ర వ్యాఖ్యలు

ఆసియా నంబర్‌వన్‌గా ధీరజ్ బొమ్మదేవర..
క్రీడలు

ఆసియా నంబర్‌వన్‌గా ధీరజ్ బొమ్మదేవర..

గాజాకు నార్వే ఫుట్‌బాల్ సాయం
క్రీడలు

గాజాకు నార్వే ఫుట్‌బాల్ సాయం

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా
జనరల్

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా

దీక్ష విరమించాలన్న అఖిలేశ్
రాజకీయాలు

దీక్ష విరమించాలన్న అఖిలేశ్

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర
జనరల్

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర

ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్
క్రీడలు

ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్

ఈ20 పెట్రోల్‌పై అపోహలు ఖండించిన గడ్కరీ
జనరల్

ఈ20 పెట్రోల్‌పై అపోహలు ఖండించిన గడ్కరీ

మోదీపై పోలాండ్ మంత్రి ప్రశంసలు
జనరల్

మోదీపై పోలాండ్ మంత్రి ప్రశంసలు

సుధీర్ చౌదరికి దీప్కే ఘాటు కౌంటర్
జనరల్

సుధీర్ చౌదరికి దీప్కే ఘాటు కౌంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!