
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వంపై డీఎంకే సీనియర్ నాయకుడు, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మరో ఆరు నెలలు కూడా కొనసాగదని, త్వరలోనే కుప్పకూలుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే నెలల్లో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
దక్షిణ తమిళనాడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో టీవీకే నేత ఆధవ్ అర్జునకు అనితా రాధాకృష్ణన్ బహిరంగ సవాల్ విసిరారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరుచెందూర్‌లో పోటీ చేయాలని, తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఓడించిన కొలత్తూరు ఓటర్లపై కూడా ఆయన విమర్శలు చేశారు. ప్రస్తుతం డీఎంకే, టీవీకే పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తత మరింత పెరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!