
బిజినెస్

ఆహార కల్తీ, మాదకద్రవ్యాల నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కల్తీ ఆహారం కారణంగా క్యాన్సర్తో పాటు ఇతర తీవ్రమైన వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఆహార భద్రత శాఖ మరియు డ్రగ్ కంట్రోల్ శాఖలను విలీనం చేసి ఒకే సమగ్ర సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కొత్త వ్యవస్థను ఒకే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ (HOD) ఆధ్వర్యంలో నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
ఈ సంస్కరణల్లో భాగంగా అమలు వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాల పునర్వ్యవస్థీకరణకూ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కల్తీ ఆహార తయారీ, విక్రయాలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం, ప్రజారోగ్య పరిరక్షణను బలోపేతం చేయడం ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!