

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్, పలువురు మంత్రులు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలలో 90 శాతం గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
అభ్యర్థులకు బీ-ఫారమ్‌లు ఇచ్చే విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే జనరల్ సీట్లలో గెలిచే అవకాశమున్న బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంలో సానుకూలంగా ఉండాలని మంత్రులను కోరారు. రెబల్స్ సమస్య రాకుండా బుజ్జగింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని, టికెట్ రాక అసంతృప్తిగా ఉన్న నేతలను మంత్రులు స్వయంగా కలిసి ఒప్పించాలని సూచించారు. వచ్చే నెల 3 నుంచి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ఈ సమావేశంలో ఇప్పటివరకు నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వివరించగా, బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం, పీసీసీ చీఫ్ మంత్రులను కోరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!