
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో నాగబాబు తొలిసారి స్పందించారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుతో పాటు తన సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.
మొక్కలు నాటడం తన జీవితంలో ఒక భాగమని నాగబాబు పేర్కొన్నారు. ఈ పదవిని కేవలం ప్రోటోకాల్ హోదాగా కాకుండా ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తానని, రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు నిరంతరం శ్రమిస్తానని నాగబాబు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!