
జనరల్

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో బీజేపీ నేత వీరేంద్ర గోయల్ చేసిన గ్రీన్ ఎనర్జీ ప్రచారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సింగ్రౌలి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన 27 కిలోమీటర్ల దూరం ఈ-రిక్షాలో ప్రయాణించారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే ఆయన వెనుక దాదాపు 200 ఇంధన వాహనాల కాన్వాయ్ రావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. గ్రీన్ మెసేజ్ ఇవ్వాలనుకున్న కార్యక్రమమే భారీగా ఇంధనం ఖర్చు చేసిన కాన్వాయ్ కారణంగా వివాదంగా మారింది. దీనిపై స్పందించిన వీరేంద్ర గోయల్.. అభిమానంతో కార్యకర్తలు వచ్చారని, వారిని ఆపడం సాధ్యపడలేదని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!