

గత వైఎస్సార్సీపీ పాలనలో మద్యం సరఫరా ఆర్డర్లు మరియు రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. 2020 నుంచి 2024 మధ్య మద్యం రవాణా టెండర్లలో రిగ్గింగ్, అధిక రవాణా ఛార్జీల విధింపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.200 నుంచి 400 కోట్ల వరకు నష్టం కలిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్టును కేంద్రీకరించి సిగ్మా లాజిస్టిక్స్‌కు ఒక్కో కేసుకు రూ.34 చొప్పున కాంట్రాక్టు కట్టబెట్టడంతో భారీ అక్రమాలు జరిగాయని దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ కేసు దర్యాప్తును విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించారు.
ఇదిలా ఉండగా, మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తుల జప్తుకు సిట్ చర్యలు ప్రారంభించింది. రష్మితా బెహరా, ఇర్ష్షాద్ అహ్మద్, ముబారక్ అలీకి చెందిన హైదరాబాద్ మరియు ఒడిశాలో ఉన్న ఆస్తులను జప్తు చేయడానికి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయడానికి హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఈ దర్యాప్తులో మరిన్ని నిందితుల పాత్ర బయటపడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!