

మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పోరాడిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ సంకల్పంతో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని సీఎం పేర్కొన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన ప్రాణత్యాగమే నాంది పలికిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
స్వార్థరహిత త్యాగంతో లక్ష్యాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలవాలని నేతలు ఆకాంక్షించారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!