

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ క్రమశిక్షణ, అంకితభావం, ప్రజాసేవకే అగ్ర ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, ప్రజాసేవలో ఆయన మంచి ఆరోగ్యం, మరింత విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
‘పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫార్మ్స్ ఏపీ’ 6వ అధ్యాయాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అన్నామలై ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేస్తూ పవన్ నాయకత్వం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే పాలనను కొనియాడారు. తిరుపతి నుంచి పళని వరకు భక్తుల చిరకాల కోరిక పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నెరవేరిందని పేర్కొన్నారు. భక్తుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ రెండు బస్సు సర్వీసులు ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రజలను కేవలం పౌరులుగా కాకుండా కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వారి సమస్యలను బాధ్యతతో పరిష్కరించేందుకు పవన్ కట్టుబడి ఉంటారని అన్నామలై తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!