
బిజినెస్

నాదర్‌గుల్‌లో ప్రభుత్వ భూమి పరిరక్షణ, అక్రమ నిర్మాణాల అంశంపై బీజేపీ నేత ఎన్. రాంచందర్‌రావు హైడ్రా కమిషనర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కమిషనర్ వైఖరిలో మార్పు రాలేదని ఆరోపించారు. కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తూ కేసును కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. నాదర్‌గుల్‌లో ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ.. అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రా తక్షణ చర్యలు తీసుకోవాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. నాదర్‌గుల్ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హైడ్రాకు మజ్లిస్‌పై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో హైడ్రా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!