

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూముల కేటాయింపుపై వస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఈ వ్యవహారానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భూ కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, కన్సల్టేటివ్ కమిటీ ఆన్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కమిటీ ఆమోదంతో, నిబంధనల ప్రకారం జరిగినదని తెలిపారు.
ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తప్పుడు పత్రాలతో ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకునే కుట్రగా పేర్కొన్నారు. తప్పుడు వార్తలను ప్రభుత్వం సహించదని హెచ్చరిస్తూ, భూ కేటాయింపుల్లో నూటికి నూరు శాతం పారదర్శకత పాటిస్తున్నామని మంత్రి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!