
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 404 సర్పంచి స్థానాలకు గానూ 136 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 268 సర్పంచి స్థానాలకు 853 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అలాగే, 1,545 వార్డు సభ్యుల స్థానాలకు 3,333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పుల్లంపేట మండలంలోని వాతలూరు గ్రామ పంచాయతీలో అత్యధికంగా 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నికల అధికారులు 1.82 లక్షల ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తికావడంతో తొలి విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!