25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డబ్బుల్లేవని గర్ల్‌ఫ్రెండ్‌ వదిలేసి వెళ్లిపోయింది.. కెరీర్‌ ఆరంభ కష్టాలను గుర్తుచేసుకున్న విశ్వక్‌సేన్‌

Writer: Chandrika 06:14 AM, 25 నవంబర్, 2026
డబ్బుల్లేవని గర్ల్‌ఫ్రెండ్‌ వదిలేసి వెళ్లిపోయింది.. కెరీర్‌ ఆరంభ కష్టాలను గుర్తుచేసుకున్న విశ్వక్‌సేన్‌

తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని నటుడు విశ్వక్‌సేన్‌ గుర్తుచేసుకున్నారు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఈఎన్‌ఈ: రిపీట్‌’ ఇటీవల విడుదలై యువత నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో విశ్వక్‌ తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 17 ఏళ్ల వయసులోనే ఫిల్మ్‌ స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టానని, దాదాపు నాలుగేళ్లపాటు అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పారు. ఆ సమయంలో తన దగ్గర డబ్బులు లేకపోవడంతో గర్ల్‌ఫ్రెండ్‌ కూడా వదిలేసి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఓ సినిమాలో మొదట హీరోగా అవకాశం వచ్చినప్పటికీ, నెలలు గడిచేకొద్దీ తన పాత్ర ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ రెండో, మూడో, చివరకు నాలుగో హీరో స్థాయికి మార్చారని తెలిపారు. అయినా సినిమా కోసం అప్పులు చేసి మరీ చిత్రబృందానికి అవసరమైనవి సమకూర్చానని చెప్పారు.

చివరకు ఆ సినిమా నుంచి తనను తొలగించిన విషయం 20 రోజుల తర్వాత తెలిసిందని విశ్వక్‌ తెలిపారు. ఆ విషయం తెలిసి ఇంటికి వెళ్లి ఎంతో బాధతో ఏడ్చానని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఓ మలయాళ సినిమా చూసి దర్శకత్వంపై ఆసక్తి పెంచుకున్నానని, అదే తన తొలి దర్శకత్వ చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’కు దారితీసిందని చెప్పారు. ఇదే సమయంలో తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లానని, కేవలం 20 నిమిషాల్లోనే ఆయన కథ చెప్పారని వెల్లడించారు. తన జీవితంలో ఎదురైన అనుభవాలే ఆ కథలో కనిపించాయని, ఆ సినిమా తన కెరీర్‌కు కీలక మలుపుగా నిలిచిందని విశ్వక్‌సేన్‌ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’

99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’

‘అశ్విన్స్‌’ దర్శకుడితో శ్రుతిహాసన్‌ కొత్త సినిమా..

‘అశ్విన్స్‌’ దర్శకుడితో శ్రుతిహాసన్‌ కొత్త సినిమా..

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్!

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్!

దీపికకు కరణ్ జోహార్, అక్షయ్ కుమార్ మద్దతు.. మహిళా నటీమణుల హక్కులపై కీలక వ్యాఖ్యలు!

దీపికకు కరణ్ జోహార్, అక్షయ్ కుమార్ మద్దతు.. మహిళా నటీమణుల హక్కులపై కీలక వ్యాఖ్యలు!

యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి ‘వారణాసి’ భారీ సెట్స్.. వైరల్ అవుతున్న విజువల్స్!

యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి ‘వారణాసి’ భారీ సెట్స్.. వైరల్ అవుతున్న విజువల్స్!

భావోద్వేగానికి గురిచేసిన ‘ఆకాశంలో ఒక తార’.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

భావోద్వేగానికి గురిచేసిన ‘ఆకాశంలో ఒక తార’.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
విశ్వక్‌సేన్‌తరుణ్‌ భాస్కర్‌ఈఎన్‌ఈ రిపీట్‌ఈ నగరానికి ఏమైందిఫలక్‌నుమా దాస్‌తెలుగు సినిమాసినీ కెరీర్‌నటుడి కష్టాలువిశ్వక్‌సేన్‌ వ్యాఖ్యలుసినిమా విజయోత్సవం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో 96% మంది ఉద్యోగులు తరచూ ఏఐ వినియోగం: బీసీజీ నివేదిక
జనరల్

భారత్‌లో 96% మంది ఉద్యోగులు తరచూ ఏఐ వినియోగం: బీసీజీ నివేదిక

99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’
సినిమాలు

99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..
బిజినెస్

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..

హీలియం అవసరం లేని ఎంఆర్‌ఐ యంత్రం..
జనరల్

హీలియం అవసరం లేని ఎంఆర్‌ఐ యంత్రం..

డబ్బుల్లేవని గర్ల్‌ఫ్రెండ్‌ వదిలేసి వెళ్లిపోయింది.. కెరీర్‌ ఆరంభ కష్టాలను గుర్తుచేసుకున్న విశ్వక్‌సేన్‌
సినిమాలు

డబ్బుల్లేవని గర్ల్‌ఫ్రెండ్‌ వదిలేసి వెళ్లిపోయింది.. కెరీర్‌ ఆరంభ కష్టాలను గుర్తుచేసుకున్న విశ్వక్‌సేన్‌

ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..
బిజినెస్

ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..

‘అశ్విన్స్‌’ దర్శకుడితో శ్రుతిహాసన్‌ కొత్త సినిమా..
సినిమాలు

‘అశ్విన్స్‌’ దర్శకుడితో శ్రుతిహాసన్‌ కొత్త సినిమా..

అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..
జనరల్

అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..
జనరల్

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!
జనరల్

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..
జనరల్

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..

నేటి రాశి ఫలాలు:  12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!
జనరల్

నేటి రాశి ఫలాలు: 12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!