

భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తనిఖీలు, పరిశీలనలకు సంబంధించి బిస్లరీ ఇంటర్నేషనల్ మంగళవారం వివరణ ఇచ్చింది. గోవాలోని తమ ప్లాంట్‌లో 2025 సెప్టెంబరులో తయారైన ఒక బ్యాచ్ ప్యాకేజ్డ్ తాగునీటికి మాత్రమే ఈ చర్యలు పరిమితమయ్యాయని తెలిపింది. ఆ బ్యాచ్‌కు సంబంధించిన ఒక నమూనాలో పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్ల (పీఏహెచ్) స్థాయి లీటరుకు 0.144 మైక్రోగ్రాములుగా నమోదైనట్లు కంపెనీ అంగీకరించింది. అయితే, ఆ బ్యాచ్ ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడా అందుబాటులో లేదని స్పష్టం చేసింది.
గోవా ప్లాంట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న తమ 143 తయారీ కేంద్రాలన్నీ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నాయని బిస్లరీ వెల్లడించింది. ఒక నిర్దిష్ట బ్యాచ్‌కు సంబంధించి జరిగిన నియంత్రణ సంస్థ తనిఖీలను మొత్తం కంపెనీ కార్యకలాపాలకు ముడిపెట్టడం సరికాదని పేర్కొంది. ఈ వ్యవహారంపై వినియోగదారులు ధ్రువీకరించిన సమాచారాన్నే విశ్వసించాలని కోరింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!