

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. సహారన్‌పూర్ జిల్లాలోని బెహట్ నుంచి ఉమర్ అలీ ఖాన్, సహారన్‌పూర్ నుంచి ఆశు మాలిక్, షామ్లీ జిల్లాలోని కైరానా నుంచి నహిద్ హసన్, అమ్రోహా నుంచి మెహబూబ్ అలీ, లలిత్‌పూర్ నుంచి జ్యోతి లోధిని బరిలోకి దింపుతున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేసింది.
వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పీడీఏ (PDA) నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ వర్గాల ప్రజలు ఐక్యంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు 26 అసెంబ్లీ స్థానాలను కేటాయించే ప్రతిపాదనను ఎస్పీ ముందుంచినట్లు సమాచారం. రెండో విడత చర్చల అనంతరం సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!