

99వ ఆస్కార్ అవార్డుల ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ నుంచి పరిశీలనకు వెళ్లిన ‘గోంధల్’, ‘అంగ్’ చిత్రాలు అర్హత జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మంగళవారం మొత్తం 104 చిత్రాలతో అధికారిక జాబితాను విడుదల చేసింది. జపాన్‌కు చెందిన ‘ఆల్ ఆఫ్ ఎ సడెన్’, పోలాండ్ చిత్రం ‘ఫాదర్‌ల్యాండ్’ సహా వివిధ దేశాల చిత్రాలతో భారతీయ సినిమాలు పోటీపడనున్నాయి. అర్హత జాబితాలో చోటు దక్కించుకున్న ఈ చిత్రాలు తదుపరి షార్ట్‌లిస్ట్‌లో స్థానం సంపాదించడంతో పాటు తుది నామినేషన్ల కోసం పోటీపడతాయి.
నాగాలాండ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘అంగ్’ చిత్రానికి తేజ రియో దర్శకత్వం వహించారు. పూర్వీకుల విశ్వాసాలు, సంప్రదాయ జీవన విధానాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించే ఓ గ్రామ పెద్ద, ఆయన కుమారుడి చుట్టూ ఈ కథ సాగుతుంది. బాఫ్టా అవార్డు గ్రహీత డగ్లస్ హెన్‌షాల్‌తో పాటు నాగాలాండ్‌కు చెందిన నటీనటులు ఇందులో నటించారు. ఇక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రదర్శించే జానపద కళారూపం నేపథ్యంలో రూపొందిన మరాఠీ చిత్రం ‘గోంధల్’కు సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించారు. ఇషితా దేశ్‌ముఖ్, కిశోర్ కదమ్, యోగేశ్ సోహని తదితరులు కీలక పాత్రలు పోషించారు. 99వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 14న లాస్ ఏంజెలెస్‌లో జరగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!