25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హీలియం అవసరం లేని ఎంఆర్‌ఐ యంత్రం..

Writer: Chandrika 06:24 AM, 25 నవంబర్, 2026
హీలియం అవసరం లేని ఎంఆర్‌ఐ యంత్రం..

దేశీయ వైద్య రంగంలో స్వావలంబనను పెంపొందించడంతో పాటు ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య పరీక్షలు అందించాలనే లక్ష్యంతో భారత శాస్త్రవేత్త డాక్టర్ అర్జున్ అరుణాచలం హీలియం అవసరం లేని ఎంఆర్‌ఐ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన.. అమెరికాలో మాస్టర్స్, పీహెచ్‌డీ చేసి, అక్కడ పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేశారు. అయితే భారత్‌లోనే సాంకేతిక ఆవిష్కరణలు చేయాలనే సంకల్పంతో 2008లో స్వదేశానికి తిరిగొచ్చారు. బెంగళూరులో వోక్సెల్‌గ్రిడ్స్‌ సంస్థను స్థాపించి, సోషల్ ఆల్ఫా సహకారంతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సంప్రదాయ ఎంఆర్‌ఐ యంత్రాల్లో అయస్కాంతాలను చల్లబరిచేందుకు భారీగా హీలియం వినియోగిస్తారు. దీనికి ప్రత్యామ్నాయంగా డ్రై మ్యాగ్నెట్‌ సాంకేతికత, క్రయోకూలర్‌ విధానాన్ని ఉపయోగించి దేశీయ 1.5 టెస్లా ఎంఆర్‌ఐ స్కానర్‌ను రూపొందించారు. సాధారణంగా ఎంఆర్‌ఐ యంత్రాల ధర రూ.6–8 కోట్లు ఉండగా.. ఈ కొత్త యంత్రం ధర అందులో సుమారు 60 శాతమే. అంటే విదేశీ యంత్రాల కంటే దాదాపు 40 శాతం తక్కువ. రోగుల స్కానింగ్ ఖర్చులను కూడా 70 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది.

మహారాష్ట్రలోని చంద్రాపూర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఈ యంత్రాన్ని తొలిసారిగా పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయి. అనంతరం గేట్స్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్, సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థల నుంచి ఆర్డర్లు లభించాయి. జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కూడా ఈ ప్రయత్నానికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఏడాదికి 20–25 స్కానర్లను తయారు చేసే సామర్థ్యం వోక్సెల్‌గ్రిడ్స్‌కు ఉంది. డిమాండ్‌కు అనుగుణంగా మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్‌లలో ఉత్పత్తి కేంద్రాలను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయాలన్న బహుళజాతి సంస్థల ప్రతిపాదనలను అర్జున్ తిరస్కరించారు. వ్యక్తిగత లాభం కంటే దేశీయ వైద్య రంగానికి మేలు చేయడమే ముఖ్యమని భావించి ఈ ఆవిష్కరణను భారత్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. యంత్రాన్ని రీసైకిల్ చేసుకునేలా కూడా రూపకల్పన చేశారు. స్వదేశీ వైద్య సాంకేతికతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డు-2026 లభించింది. భవిష్యత్తులో ఉత్పత్తిని పెంచి దక్షిణ, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలకు ఎగుమతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..

అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..

నేటి రాశి ఫలాలు:  12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!

నేటి రాశి ఫలాలు: 12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!

ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన

ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన

ట్యాగ్లు
డాక్టర్ అర్జున్ అరుణాచలంవోక్సెల్‌గ్రిడ్స్హీలియం రహిత ఎంఆర్‌ఐదేశీయ ఎంఆర్‌ఐ యంత్రంవైద్య సాంకేతికతవైద్య రంగంలో ఆవిష్కరణలుభారత శాస్త్రవేత్తడ్రై మ్యాగ్నెట్ టెక్నాలజీరామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డు 2026మేక్ ఇన్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో 96% మంది ఉద్యోగులు తరచూ ఏఐ వినియోగం: బీసీజీ నివేదిక
జనరల్

భారత్‌లో 96% మంది ఉద్యోగులు తరచూ ఏఐ వినియోగం: బీసీజీ నివేదిక

99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’
సినిమాలు

99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..
బిజినెస్

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..

హీలియం అవసరం లేని ఎంఆర్‌ఐ యంత్రం..
జనరల్

హీలియం అవసరం లేని ఎంఆర్‌ఐ యంత్రం..

డబ్బుల్లేవని గర్ల్‌ఫ్రెండ్‌ వదిలేసి వెళ్లిపోయింది.. కెరీర్‌ ఆరంభ కష్టాలను గుర్తుచేసుకున్న విశ్వక్‌సేన్‌
సినిమాలు

డబ్బుల్లేవని గర్ల్‌ఫ్రెండ్‌ వదిలేసి వెళ్లిపోయింది.. కెరీర్‌ ఆరంభ కష్టాలను గుర్తుచేసుకున్న విశ్వక్‌సేన్‌

ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..
బిజినెస్

ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..

‘అశ్విన్స్‌’ దర్శకుడితో శ్రుతిహాసన్‌ కొత్త సినిమా..
సినిమాలు

‘అశ్విన్స్‌’ దర్శకుడితో శ్రుతిహాసన్‌ కొత్త సినిమా..

అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..
జనరల్

అవినీతి నిరోధక శాఖ అధికారిపైనే లంచం ఆరోపణలు..

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..
జనరల్

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక..

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!
జనరల్

నాలుగు రాశుల వారికి కుబేర యోగం.. ధనలాభాలు, అదృష్టం కలిసొచ్చే సూచనలు!

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..
జనరల్

సుప్రీంకోర్టు అనుమతితో తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం..

నేటి రాశి ఫలాలు:  12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!
జనరల్

నేటి రాశి ఫలాలు: 12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!