

తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ రాష్ట్రంలో తన బాధ్యతలను నిర్వహించిన అనుభవంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం లభించిందని తెలిపారు. తనకు సహకరించిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన బీఎం సందీప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు నిర్వహించే క్రమంలో తనకు సహకరించిన నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
సోనియా గాంధీ చేసిన త్యాగం, కృషి ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మీనాక్షీ నటరాజన్ పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాలనే లక్ష్యంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తనకు లభించిన సహకారం, అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆమె పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!