

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాన్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విచారణకు ఆదేశించింది. ఓ అత్యాచారం కేసులో రాజీ కుదిర్చి, కేసును నీరుగార్చేందుకు రూ.5 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలను కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి రెండు వారాల్లోగా చర్యల నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. మాజీ న్యాయమూర్తి రంజిత్ సింగ్ చేసిన బహిరంగ వ్యాఖ్యల ఆధారంగా ఈ ఫిర్యాదు కమిషన్ దృష్టికి వచ్చింది.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కానూంగో నేతృత్వంలోని ధర్మాసనం మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993లోని సెక్షన్ 12 కింద ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. మహిళా భద్రతా విభాగానికి కూడా వివరాలను పంపింది. అయితే ప్రస్తుతం ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, పూర్తి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. మరోవైపు తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ గురుప్రీత్ కౌర్ మాన్ మాజీ న్యాయమూర్తి రంజిత్ సింగ్‌కు న్యాయపరమైన నోటీసు పంపారు. 24 గంటల్లో బేషరతుగా వివరణ ఇవ్వాలని, లేకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!