

ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బారాఖంబ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీఎస్‌లో రాహుల్ గాంధీని కలిసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసు అధికారులు ఆయనను స్టేషన్ సమీపంలోనే అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో బారాఖంబ పీఎస్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో ఇప్పటికే భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇదిలా ఉండగా, బ్రిటీష్ కౌన్సిల్ సమీపంలో ఆందోళన చేస్తున్న ఎంపీలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి లాఠీ దెబ్బలు తగిలినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వ్యవహారాలకు సంబంధించి కొనసాగుతున్న ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఢిల్లీలో రాజకీయ వేడిని మరింత పెంచాయి. పోలీసుల చర్యపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!