

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH) ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా జిల్లాల వారీగా అమలు చేయాల్సిన కార్యాచరణ, ప్రాజెక్టు పురోగతికి అవసరమైన అంశాలపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. GHH ప్రారంభోత్సవానికి హాజరై ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఇదే భేటీలో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు (EAPs) విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా నిర్మలా సీతారామన్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, ఆర్థిక అంశాలపై సమన్వయంతో ముందుకు వెళ్లే దిశగా ఈ భేటీ సాగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!