

ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టి మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ కుమార్ తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం చికిత్స పొందుతూనే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కిరణ్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
యూట్యూబ్ వేదికగా తనదైన కామెడీ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ కుమార్ ‘అగ్గిపెట్టి మచ్చ’ పేరుతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రూపొందించిన కామెడీ వీడియోలు, వినోదాత్మక కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఆయన మృతి వార్త తెలుసుకున్న పలువురు యూట్యూబర్లు, కళాకారులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!