

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోందని ఆమె ఆరోపించారు. దివంగత వైఎస్సార్, డి.శ్రీనివాస్‌ల మాదిరిగా తమది కూడా బలమైన జోడీ అని రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకుంటున్నారని, అయితే వారి మధ్య విభేదాలు బయటపడుతున్న తీరు చూస్తుంటే ఆ జోడీ ‘ఇడుపు కాయితం’గా మారినట్లుందని కవిత ఎద్దేవా చేశారు.
ఒకవైపు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ బీసీ ముఖ్యమంత్రి అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ తన రాజకీయ ప్రాధాన్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా కుర్చీలాట, వర్గపోరులో మునిగిపోయారని ఆమె విమర్శించారు. అయితే కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ విమర్శల్లో భాగమేనని, ఆమె ఆరోపణలపై కాంగ్రెస్ నేతల స్పందన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!