

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన చంద్రబాబు.. తదుపరి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ఈ భేటీల్లో సీఎం ప్రస్తావించనున్నారు.
ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గోదావరి-కావేరి నదుల అనుసంధానం, గోదావరి పుష్కరాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టు, అలాగే ఏపీలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహకారం కోరే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులోనూ చంద్రబాబు పాల్గొననున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!