

బిగ్‌బాస్ తెలుగు 10 తాజా ప్రోమోలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. శనివారం ఎపిసోడ్లో నాగార్జున ఇచ్చిన ఆఫర్‌ను మిథిలేష్ స్వీకరించి రూ.15 లక్షల సూట్‌కేస్‌తో హౌస్ నుంచి వెళ్లిపోయినట్లు ప్రోమోలో చూపించారు. ఈ మొత్తాన్ని విజేత ప్రైజ్ మనీ నుంచి తగ్గిస్తామని చెప్పగా.. హౌస్‌లోని కంటెస్టెంట్లు ఓటింగ్ ద్వారా మిథిలేష్‌ను బయటకు పంపినట్లు తెలుస్తోంది. రామ్ ప్రసాద్ ఇతర కంటెస్టెంట్ల అభిప్రాయాలను అడగగా, కొందరు తమకు కప్పు ముఖ్యమని చెప్పడంతో మిథిలేష్‌కు సూట్‌కేస్ ఇచ్చి పంపినట్లు ప్రోమోలో కనిపించింది.
మిథిలేష్‌ను రూ.15 లక్షలు ఇచ్చి పంపడంపై త్రిగుణ్, ముకేశ్.. రామ్ ప్రసాద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజేత ప్రైజ్ మనీ నుంచి ఆ మొత్తం తగ్గుతుందని తెలిసి కూడా ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. మిథిలేష్‌కు డబ్బులు ఇచ్చి పంపించేందుకు మద్దతు తెలిపిన వారిపైనా త్రిగుణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మిథిలేష్‌కు రూ.15 లక్షలు రావడానికి అమన్ మద్దతు కూడా కారణమైందని చెప్పడంతో త్రిగుణ్, ముకేశ్ అతనితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అమన్, త్రిగుణ్ మధ్య మాటామాటా పెరిగి గొడవ తీవ్ర స్థాయికి చేరినట్లు ప్రోమోలో చూపించారు. వంశీ కూడా మధ్యలో కలగజేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!