

వైకాపా ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి అన్యాయం చేసింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో అడ్డుకునేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని రెడ్డి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. అయితే, ఈ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టులో న్యాయపరమైన విచారణ కొనసాగుతోంది. 34 శాతం కోటాకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులపై తీర్పును హైకోర్టు ఇటీవల రిజర్వ్ చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!