

పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రీ రిలీజ్లో మంచి హైప్ తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే వచ్చింది. పవన్ కళ్యాణ్ మాస్ స్టైల్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నా కథ, కథనం పాత శైలిలోనే ఉందనే విమర్శలు వినిపించాయి. ఇదే సమయంలో ధురంధర్ 2 పోటీ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కష్టాలను ఎదుర్కొంటోంది.
ఇక ఈ సినిమా ఓటీటీ విడుదలపై స్పష్టత వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత సుమారు ఐదు వారాల గ్యాప్‌తో వచ్చే నెల 24 న లేదా మే మొదటి వారంలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఇప్పుడు ఓటీటీపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.



.jpg&w=3840&q=75)

.jpg&w=3840&q=75)
.jpeg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!