

నటిగా పలు సినిమాల్లో కనిపించిన శ్రీదేవి, కోర్ట్ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె తమిళంలో తొలిసారిగా నటించిన హైకూ సినిమా ఓటీటీలోకి రానుంది. ఏగన్, ఫెమినా జార్జ్ కీలక పాత్రల్లో నటించిన ఈ ప్రేమకథకు యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 23న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
హైకూ కథ మనోహర్ (ఏగన్) చుట్టూ సాగుతుంది. కాలేజీ నుంచి సస్పెండ్ అయిన అతడికి ఇతర కాలేజీల్లో అడ్మిషన్ దొరకకపోవడంతో మహిళల కాలేజీ నుంచి కో-ఎడ్యుకేషన్‌గా మారిన ఓ కాలేజీలో చేరతాడు. అక్కడ పవళకుడి (శ్రీదేవి)తో ప్రేమలో పడతాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం కోయంబత్తూరు నుంచి చెన్నైకి వెళ్తాడు. దూరంగా ఉండటం వల్ల వారి ప్రేమలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇద్దరూ విడిపోవడానికి కారణాలేమిటి? చెన్నైలో ఇంటర్న్‌గా పనిచేసే నివేదా (ఫెమినా జార్జ్)తో మనోహర్‌కు ఏర్పడిన సంబంధం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరికి పవళకుడిని మళ్లీ కలిసినప్పుడు అతడికి తెలిసే విషయాలేమిటి? అన్నదే మిగతా కథ.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!