

రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా అనుమాన పక్షి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. డీజే టిల్లు సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు విమల్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 20, శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది. కామెడీ, సస్పెన్స్, క్రైమ్ అంశాలతో రూపొందిన ఈ కథలో కశ్మీర్ పర్యటన అనూహ్యమైన హత్య కేసుగా మారుతుంది.
ఈ సినిమాలో రాగ్ మయూర్ సన్నీ పాత్రలో కనిపిస్తాడు. అనుమాన పక్షి పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపే సన్నీకి ఓ స్నేహితుడి నుంచి కశ్మీర్ రావాలంటూ ఫోన్ వస్తుంది. అతడి బెదిరింపుతో స్నేహితులతో కలిసి కశ్మీర్ వెళ్లిన సన్నీ అక్కడ కన్య (మెరిన్ ఫిలిప్)తో ప్రేమలో పడతాడు. ఇదే సమయంలో అతడి స్నేహితుడు వర్మ (ప్రిన్స్) హత్యకు గురవుతాడు. వర్మ మృతదేహం సన్నీ గదిలో కనిపించడంతో అతడు ఇబ్బందుల్లో పడతాడు. ఈ కేసు గురించి తెలుసుకునేందుకు పోలీస్ అధికారి వాసు (అజయ్) తన భార్య సుజి (రాశి)తో అక్కడికి వస్తాడు. పోలీసుల నుంచి హత్య విషయం దాచేందుకు సన్నీ, అతడి స్నేహితులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? వర్మను హత్య చేసింది ఎవరు? సన్నీ, కన్య ప్రేమకథ ఏమైంది? అన్నది మిగతా కథ.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!