
క్రీడలు

తన సబ్స్క్రైబర్లకు ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన కంటెంట్ అందిస్తూ వస్తున్న ఆహా ఓటీటీ, ఇప్పుడు సూపర్ హిట్ గేమ్ షో సర్కార్ సీజన్ 6ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ నెల 27వ తేదీ నుంచి సాయంత్రం 7 గంటలకు ఈ కొత్త సీజన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన ప్రోమో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హోస్ట్ సుధీర్ నిర్వహిస్తున్న ఈ షోలో హీరోయిన్లు పాయల్ రాజ్పుత్, రాశీ సింగ్, హెబ్బా పటేల్, గెహనా సిప్పీలు సందడి చేశారు. అలాగే అఖిల్ సార్థక్, మోనల్ గజ్జర్, విష్ణు ప్రియ, పృథ్వీ తమ వినోదాత్మక ప్రదర్శనలతో షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుధీర్ అడిగిన ప్రశ్నలకు కంటెస్టెంట్లు చెప్పిన ఫన్నీ సమాధానాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తనున్నాయి.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!