

స్టార్ హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 (ఏకే 47)’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ ఇద్దరి కలయికపై ఉన్న ఆసక్తికి తగినట్లుగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా రేపు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు తమకు నచ్చిన భాషలో సినిమాను వీక్షించవచ్చు. థియేటర్లలో ఆశించిన స్పందన రాని ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. ఇందులో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, సత్య, నారా రోహిత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించగా, తమన్ సంగీతం అందించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!