

నెట్‌ఫ్లిక్స్ తొలి పాకిస్థానీ ఒరిజినల్ సిరీస్ జో బచాయే హై సంగ్ సమేట్ లో ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. అయితే ఈ సిరీస్ భారత్‌లో అందుబాటులోకి వస్తుందా లేదా అనే విషయంలో అనిశ్చితి నెలకొంది. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ఈ సిరీస్‌ను భారత్‌లో నిషేధించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మరోవైపు, భారత్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో భారతీయ ప్రేక్షకులు ఈ పాకిస్థానీ డ్రామాను చూడగలరా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ సిరీస్‌లో ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, హానియా ఆమిర్, అహద్ రజా మీర్, సనమ్ సయీద్, హమ్జా అలీ అబ్బాసీ, ఇక్ఱా అజీజ్, మాయా అలీ, బిలాల్ అష్రఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాకిస్థానీ డ్రామాలకు, ముఖ్యంగా ఈ నటీనటులకు భారత్‌లోనూ మంచి అభిమానులు ఉండటంతో సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. మోమినా దురైద్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ కానుంది. అయితే భారత్‌లో విడుదలవుతుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!