
షోస్

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’లో చివరిసారిగా తెరపై కనిపించిన రేణూదేశాయ్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రతి ఆదివారం ఈటీవీ విన్ అందిస్తున్న ‘కథాసుధ’ సిరీస్‌లో భాగంగా రూపొందిన ‘కాశీ మజిలీ’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించారు. ‘కొన్ని ప్రేమకథలకు మరో అవకాశం దక్కాలి’ అనే ఆసక్తికరమైన థీమ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
యమున కిశోర్ దర్శకత్వం వహించిన ‘కాశీ మజిలీ’ సెప్టెంబరు 13 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్‌లోని సంభాషణలు, కథాంశం సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. రేణూదేశాయ్ మరోసారి కీలక పాత్రలో కనిపించనుండటంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!