
క్రీడలు

పంచనామా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అధి అనే యువకుడు CI జైరామ్‌తో అన్నదమ్ముల్లాంటి అనుబంధం కలిగి ఉంటాడు. అయితే అధి హాస్టల్‌లో మృతి చెందడంతో జైరామ్ ఈ కేసును స్వయంగా దర్యాప్తు చేయడం మొదలుపెడతాడు. అతని మరణం వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకునే క్రమంలో ఊహించని విషయాలు బయటకు వస్తాయి.
అధి వేలిముద్రలు మరో ఇద్దరి వేలిముద్రలతో సరిపోలుతున్నాయని జైరామ్ గుర్తిస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ ఇద్దరూ కూడా అదే రోజు మృతి చెందారు. ముగ్గురు మృతులకు ఒకే వేలిముద్రలు ఎలా వచ్చాయి? ఈ వరుస మరణాల వెనుక ఎవరు ఉన్నారు? అసలు వారి ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలను జైరామ్ దర్యాప్తు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మిస్టరీ, క్రైమ్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడేవారికి పంచనామా ఒకసారి చూడదగిన సిరీస్‌గా నిలవొచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!