

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న యువతకు స్ఫూర్తినిచ్చే మరో కొత్త కార్యక్రమంలో భాగమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బీటీఎస్ సహా పలు ప్రముఖ కే-పాప్ గ్రూప్‌లను నిర్వహిస్తున్న దక్షిణ కొరియా వినోద సంస్థ హైబ్.. భారతదేశంలో ‘హైబ్ ఇండియా’ పేరుతో ప్రతిభావంతులైన యువతను గుర్తించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక టాలెంట్ సెర్చ్ కార్యక్రమానికి రష్మిక భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న రష్మిక.. మనపై మనకు నమ్మకం ఉండటం, కష్టపడి పనిచేయడం, అనుకోకుండా వచ్చే అవకాశాలను స్వీకరించడం ఎంతో ముఖ్యమని అన్నారు. భారత్‌లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి అవకాశం రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కళాకారులు, పెర్ఫార్మర్లుగా ఎదగాలని కలలు కంటున్న యువత, ముఖ్యంగా అమ్మాయిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. హైబ్ సంస్థ బీటీఎస్‌తో పాటు టీఎక్స్‌టీ, న్యూజీన్స్, ఇల్లిట్ వంటి ప్రముఖ కే-పాప్ గ్రూప్‌లతో అనుబంధం కలిగి ఉంది. సినిమాల విషయానికొస్తే.. రష్మిక ఇటీవల షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి ‘కాక్‌టెయిల్ 2’లో కనిపించారు. ప్రస్తుతం 1870ల నాటి దక్షిణ భారత నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘రణబాలి’లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!