

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అనేక సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాటిలో రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’, ప్రియాంక మోహన్ నటించిన ‘మేడిన్ కొరియా’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. వీటితో పాటు ఇతర భాషల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ హడావుడి మధ్య ఒక తెలుగు హారర్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రశాంత్ మరియు అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన 'రవం' సినిమాను దర్శకుడు శ్రీరామ్ మన్నార్ తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా లో స్ట్రీమింగ్కు వచ్చింది. ముఖ్యంగా ఈ మూవీని సబ్స్క్రిప్షన్ లేకుండానే చూడొచ్చని చెప్పడం విశేషం.
ఈ సినిమా కథ ఒక ఈఎన్టీ డాక్టర్ భూషణ్ చుట్టూ తిరుగుతుంది. తన పరిశోధనను నిరూపించుకోవడానికి ఆత్మలపై డాక్యుమెంటరీ తీయాలని యువ దర్శకుడు మౌళిని ప్రోత్సహిస్తాడు. దీంతో మౌళి తన ప్రియురాలు పూజ, స్నేహితుడు రవితో కలిసి పింజర్లపల్లి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లు ఎదుర్కొనే అనుభవాలే ఈ హారర్ థ్రిల్లర్ కథకు ప్రధానాంశం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!