
సినిమాలు

వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సత్యదేవ్ నటించిన రావు బహదూర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటించారు. జూలై 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విభిన్న కథనం, సత్యదేవ్ అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. 1968 నుంచి 1991 మధ్యకాలం నేపథ్యంలో సాగే ఈ కథలో రామప్ప రావు బహదూర్ అనే రాజవంశీకుడి జీవితాన్ని చూపించారు. కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతూనే మానసిక వేదనతో జీవించే అతని గతం, రేణుకతో ప్రేమ, వివాహ జీవితం, ఒంటరితనానికి కారణమైన రహస్యం కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!